Sun Dec 22 2024 06:00:24 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Assembly Update:ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోం.. అసెంబ్లీలో తీర్మానం
కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదని అసెంబ్లీలో తీర్మానం చేశారు
Telangana Assembly Update:కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదని అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులపై శ్రద్ధ పెట్టలేదన్నారు. నీటి ప్రయోజనాలను కాపాడటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమయిందన్నారు.
గత ప్రభుత్వం ఫెయిల్యూర్...
నీటి వాటాలను పంపకాల్లోనూ ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదన్నారు. ఎట్టిపరిస్థితులలో కేఆర్ఎంబీకి నీటి ప్రాజెక్టులను అప్పగించేది లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం తీరుతో తీరని నష్టం జరిగిందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి షరతులు అంగీకరించకుండా కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను గత ప్రభుత్వం అప్పగించిందన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా నీటి పారుదల ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు.
Next Story