Mon Dec 23 2024 12:06:47 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలపై...?
న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించే అవకాశం కన్పిస్తుంది. జనసమూహాలను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తుంది.
కరోనా తీవ్రత పెరుగుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమయింది. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించే అవకాశం కన్పిస్తుంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జనసమూహాలను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎక్కువ మంది గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ లో ఎక్కువగా ఆంక్షలు అమలు చేయాలని భావిస్తున్నారు.
ఆంక్షలు విధించే అవకాశం....
న్యూ ఇయర్ వేడుకలు వస్తుండటంతో ఎక్కువ మంది ఒకచోట గుమికూడే అవకాశముంది. న్యూ ఇయర్ పార్టీల పేరుతో ఇప్పటికే ప్రముఖ సంస్థలు ఆఫర్లను ప్రకటించాయి. వేడుకలకు ఈవెంట్ సంస్థలు సిద్ధమయ్యాయి. టిక్కెట్ల విక్రయాలు కూడా ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో నేడో, రేపో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించే అవకాశముంది. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించకుండా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని ఇప్పటికే అధికారులు సూచించారు. సంక్రాంతి, క్రిస్మస్ వేడుకలకు కూడా ఆంక్షలు విధించనున్నారు.
Next Story