Mon Dec 23 2024 09:04:31 GMT+0000 (Coordinated Universal Time)
ఈ రౌండ్ లోనూ టీఆర్ఎస్ కే ఆధిక్యం
మునుగోడు ఉప ఎన్నికల్లో ఏడో రౌండ్ కౌంటింగ్ ఫలితాలు పూర్తయ్యాయి. ఏడో రౌండ్ లోనూ టీఆర్ఎస్ దే ఆధిక్యత కనిపించింది
మునుగోడు ఉప ఎన్నికల్లో ఏడో రౌండ్ కౌంటింగ్ ఫలితాలు పూర్తయ్యాయి. ఏడో రౌండ్ లోనూ టీఆర్ఎస్ దే ఆధిక్యత కనిపించింది. ఏడో రౌండ్ లో టీఆర్ఎస్ కు 386 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఏడో రౌండ్ లో టీఆర్ఎస్ కు 7,189, బీజేపీకి 6,803 ఓట్లు వచ్చాయి. ఏడు రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ 2,555 ఓట్ల మెజారిటీతో లీడ్ లో ఉంది.
ఏడు రౌండ్లకు...
ఏడు రౌండ్లు పూర్తవ్వడంతో మరో ఎనిమిది రౌండ్లు మిగిలి ఉన్నాయి. ప్రతి రౌండ్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యత కనపరుస్తున్నా ఊహించనంత స్థాయిలో మెజారిటీ రాలేదు. దీంతో కొంత ఆందోళనతోనే ఆ పార్టీ నేతలు ఉన్నారు. గెలుపు మాట ఎలా ఉన్నా మెజారిటీ విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ తోె చీవాట్లు తినాల్సి వస్తుందని నేతలు భయపడిపోతున్నారు.
Next Story