Sun Dec 22 2024 17:31:08 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ కు ప్రాధాన్యత పెంచింది నేనే: రేవంత్ రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీకి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత చాలా పెరిగిందని.. నాయకులకు కాకుండా, పార్టీకి ప్రాధాన్యత పెరిగిందని అన్నారు. తాను పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఎంతో మంది జాతీయ నేతలు తెలంగాణకు వస్తున్నారని.. గతంలో కాంగ్రెస్ నేతలు వేరే పార్టీల్లోకి వెళ్లే వారని, ఇప్పుడు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వస్తున్నారని చెప్పుకొచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కమ్యూనిస్టులు గాంధీభవన్ కు వచ్చి చర్చలు జరిపేవారని, ఇప్పుడు తన హయాంలో మళ్లీ వస్తున్నారని అన్నారు. వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పటికీ అక్కడ సీడబ్ల్యూసీ సమావేశాలను పెట్టకుండా తెలంగాణకు అవకాశం ఇచ్చారని అన్నారు. రాష్ట్రానికి జాతీయ నాయకత్వం ఎంతో ప్రాధాన్యతను ఇస్తోందని అన్నారు రేవంత్ రెడ్డి.
హోంగార్డు రవీందర్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే హత్య చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అప్పులతో రాష్ట్రాన్ని దివాళా తీయించడం వల్లే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు హోంగార్డులకీ జీతాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకే బిల్లులు ఇస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. రవీందర్ పిల్లల చదువుల ఖర్చు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేసారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డీజీపీని కోరినట్లు రేవంత్ తెలిపారు.
Next Story