Wed Oct 30 2024 15:21:33 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : వసతి గృహాల విద్యార్థులకు రేవంత్ సర్కార్ దీవాలీ గిఫ్ట్
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు దీపావళి కానుకను ప్రకటించింది
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు దీపావళి కానుకను ప్రకటించింది. డైట్ మరియు కాస్మోటిక్స్ ఛార్జీలను పెంచుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు డైట్, కాస్మోటిక్స్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో దీపావళి పండగకు ముందే వారిలో ఆనందం వెల్లి విరుస్తుంది.
డైట్ ఛార్జీలను పెంచుతూ...
ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులకు ఇప్పటి వరకూ 950 రూపాయలు నెలకు డైట్ కాస్మోటిక్స్ ఛార్జీలు ఇచ్చేవారు. దానిని ప్రస్తుతం 1350 రూపాయలకు పెంచారు. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకూ చదివుతూ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు నెలకు డైట్, కాస్మోటిక్స్ చార్జీలు 1100 రూపాయలు ఇచ్చేవారు. దానిని 1,540 రూపాయల వరకూ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్మీడియట్ ఆ పైన చదవుతున్న విద్యార్థులకు ఈ ఛార్జీలను 1500 రూపాయల నుంచి 2,100 రూపాయలకు పెంచుతూ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 7,65,700 మంది విద్యార్థులు లబ్ది పొందనున్నారు.
Next Story