Mon Dec 23 2024 07:39:18 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ రైతులకు తీపికబురు చెప్పిన రేవంత్ రెడ్డి
తెలంగాణ రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణలో జొయిటీస్ సంస్థ తమ కేపబులిటీ సెంటర్ ను విస్తరించాలని భావించింది.
తెలంగాణ రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణలో జొయిటీస్ సంస్థ తమ కేపబులిటీ సెంటర్ ను విస్తరించాలని భావించింది. ఈ మేరకు అమెరికాలో ఉన్న రేవంత్ రెడ్డి బృందంతో సమావేశమైన జొయిటీస్ సంస్థ ప్రతినిధులు కంపెనీ విస్తరణకు అంగీకరించారు. ఈ మేరకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఈ ఏడాది సెప్టంబరు నుంచి తమ సంస్థ కార్యకలాపాలను మొదలుపెడుతుందని చెప్పారు. ప్రపంచంలోనే ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థగా జొయిటిస్ కు పేరుంది.
ప్రపంచంలోనే...
హైదరాబాద్ లో నెలకొల్పే ఈ ంస్థ కారణంగా రైతులకు ఉపయోగం చేకూరుతుందని, పాడి పరిశ్రమ అభివృద్ధికి మరింత దోహదపడుతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సంస్థ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా జంతువుల అనారోగ్యం, రోగ నిర్ధారణ, నివారణ మార్గాలు, చికిత్స వంటి అంశాలపై పరిశోధనలు చేస్తుందని తెలిపారు. వంద దేశాల్లో ఉనన ఈ సంస్థ హైదరాబాద్ లో నెలకొల్పేందుకు ముందుకు రావడం రైతులకు మరింత భరోసా నిచ్చేదిగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Next Story