Wed Mar 26 2025 19:23:33 GMT+0000 (Coordinated Universal Time)
బెట్టింగ్ యాప్స్ పై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నెంబరు.. యాక్షన్ లోకి దిగిన రేవంత్
బెట్టింగ్ యాప్స్‌పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాక్షన్ లోకి దిగింది.

బెట్టింగ్ యాప్స్‌పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాక్షన్ లోకి దిగింది. ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ పై ప్రమోషన్ చేయడంపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పోలీసులు నోటీ సులు జారీ చేశారు. యువత, సామాన్యులు బెట్టింగ్ యాప్స్ కు బలికాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు.
వారిపై చర్యలు...
అలాంటి వారిపై ఉక్కుపాదం మోపాలని రేవవత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో బెట్టింగ్ యాప్స్ పై ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నంబర్ ను కూడా ఏర్పాటు చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ ప్రమాదాల నుంచి పౌరులను రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ మోసాలకు గురైనా లేదా మీకు కనిపించే బెట్టింగ్ యాప్స్‌పై 8712672222 నెంబర్‌కు వాట్సాప్‌లో ఫిర్యాదు చేయొచ్చని తెలిపింది.
Next Story