Thu Jan 16 2025 16:17:30 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : తెలంగాణలో నేడు రేవంత్ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్.. విన్నారంటే షాకింగేనా?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేడు కీలక ప్రకటన చేయనుంది. ముఖ్యమంత్రి నేడు రైతులకు మహబూబ్ నగర్ లో గుడ్ న్యూస్ చెప్పనున్నారు
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేడు కీలక ప్రకటన చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రైతులకు మహబూబ్ నగర్ లో గుడ్ న్యూస్ చెప్పనున్నారు. దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఇందుకోసం సిద్ధం చేశారు. రైతులకు రెండు లక్షల రుణ మాఫీని పూర్తిగా చేసేందుకు రేవంత్ సర్కార్ నడుంబిగించింది. ఇందుకోసం మూడు వేల కోట్ల రూపాయల నిధులను రెడీ చేసిన ప్రభుత్వం లబ్దిదారులకు రుణమాఫీ చేస్తారని తెలిసింది. దీనికి సంబంధించిన ప్రకటన కూడా రేవంత్ రెడ్డి నేడు చేస్తారని చెబుతున్నారు. మహబూబ్ నగర్ లో నేడు రైతు పండగ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి హాజరవుతున్నారు. ఈ సభలోనే ప్రకటన ఉండనుంది.
రుణమాఫీపై చెక్కుల పంపిణీ...
మహబూబ్ నగర్ జిల్లా రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఇక్కడే కీలక ప్రకటన చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే రెండు లక్షల రూపాయల రుణమాఫీని తెలంగాణలోని రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ సభలోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి రైతులకు చెక్కులను కూడా రేవంత్ రెడ్డి పంపిణీ చేస్తారని తెలిసింది. ఇప్పటి వరకూ రెండు లక్షల రూపాయల రుణమాఫీ అందని రైతులను అధికారులు గుర్తించారు. వీరందరికీ ఈరోజు చెక్కులను పంపిణీ చేయనున్నారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ జరగకపోవడంతో ఈ నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా పదే పదే చెబుతున్న నేపథ్యంలో నేడు ఈ కార్యక్రమం జరుగుతుంది.
రైతు భరోసాపై ప్రకటన...
మరోవైపు రైతులకు సంబంధించి మరో కీలక ప్రకటన కూడా రేవంత్ రెడ్డి చేయనున్నారు. రైతు భరోసా పై కూడా రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేస్తారని తెలిసింది. సంక్రాంతి నుంచి ఎకరాకు 7,500 రూపాయల పెట్టుబడి సాయాన్ని అందిస్తామని రైతులకు తీపి కబురు రేవంత్ చెప్పనున్నారు. ఈ వేదిక నుంచే రైతు భరోసా ప్రకటన రేవంత్ రెడ్డి చేస్తారంటున్నారు. దీనికి సంబంధించి విధివిధానాలను కూడా రూపొందించారు. కేవలం సాగు అవుతున్న భూములకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అదే సమయంలో పది ఎకరాల్లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు అందేలా ప్రభుత్వంచర్యలు తీసుకుంటుంది. దీంతో ఒకే వేదిక రెండు కీలక ప్రకటనలు చేస్తారనిపార్టీ వర్గాలు తెలిపాయి.
Next Story