Wed Dec 25 2024 19:31:48 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నిరుద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పనున్న రేవంత్ సర్కార్
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలో నిరుద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలో నిరుద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. రెండు వారాల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. టీజీపీఎస్సీ భర్తీ చేసే గ్రూప్-1, 2, 3, 4 ఉద్యోగాలతో పాటు గురుకులాలు, పోలీసులు, వైద్య నియామకాల బోర్డులు, ఇతర విభాగాల పోస్టులను కలిపి రిలీజ్ చేయనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
రేవంత్ పరిశీలన తర్వాత...
నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాల తేదీలు స్పష్టంగా ఉండేలా ఇప్పటికే కసరత్తు చేస్తోందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే జాబ్ కాలెండర్ విడుదలకు రేవంత్ ప్భుత్వం సిద్ధమవుతుంది.
Next Story