Mon Dec 23 2024 11:06:22 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నలుగురు విప్ లు నియామకం
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరసగా పదవులను భర్తీ చేస్తుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలు పోస్టుల నియామకం చేస్తుంది
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరసగా పదవులను భర్తీ చేస్తుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలు పోస్టుల నియామకం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం విప్ లను నియమించింది. విప్ లుగా నలుగురిని నియమించింది. అడ్డూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్లను ఎంపిక చేసింది. నలుగురూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు.
సామాజికవర్గాలుగా...
విప్ లుగా సామాజికవర్గాలుగా చూసి నలుగురు ఎమ్మెల్యేలను ఎంపిక చేసినట్లు తెలిసింది. అన్ని ప్రధాన సామాజికవర్గాలను కవర్ చేసేలా నియామకాలను చేపట్టింది. ఈ నలుగురిని ప్రస్తుతం విప్ లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరికొన్ని కీలక పోస్టులను కూడా త్వరలో భర్తీ చేయనుంది.
Next Story