Sun Dec 22 2024 21:23:01 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ఫేక్ వీడియో షేరింగ్ తో నాకేం సంబంధం?
అమిత్ షా ఫేక్ వీడియో షేర్‌కు తనకు సంబంధం లేదని ఢిల్లీ పోలీసులకు తెలంంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం పంపారు
అమిత్ షా ఫేక్ వీడియో షేర్‌కు తనకు సంబంధం లేదని ఢిల్లీ పోలీసులకు తెలంంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం పంపారు. ఐఎన్‌సీ తెలంగాణ ట్విట్టర్ (ఎక్స్) ఖాతాను తాను నిర్వహించడం లేదన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. తాను కేవలం రెండు ట్విట్టర్ ఖాతాలను సీఎంవో తెలంగాణ, తన సొంత ఖాతాను మాత్రమే వినియోగిస్తున్నానని ఢిల్లీ పోలీసులకు సమాధానం పంపారు.
ఢిల్లీ పోలీసులకు....
అమిత్ షా వీడియోను ఫేక్ చేసి దానిని వైరల్ చేశారంటూ ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నలుగురు కాంగ్రెస్ నాయకులకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు ఢిల్లీకి వచ్చి తమ ఎదుట హాజరు కావాలని రేవంత్ రెడ్డిని పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లకుండా కేవలం ఆ నోటీసులకు సమాధానం మాత్రమే పంపారు.
Next Story