కాంగ్రెస్ గూటికి 'తుమ్మల'..?
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్ది తెలంగాణలోలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి తుమ్మల..
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్ది తెలంగాణలోలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీనియర్‌నేత మల్లు రవి భేటీ అయ్యారు. తుమ్మలను కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించారు రేవంత్‌రెడ్డి. ఆయన ఆయన విజ్ఞప్తిపై 'తుమ్మల' సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. పాలేరు అసెంబ్లీ టికెట్ దక్కక పోవటంతో తుమ్మల నాగేశ్వరరావు కొద్దిరోజులుగా బీఆర్ఎస్కు దూరంగా ఉన్నారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు అనుచరుల ద్వారా సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో రావాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోరుతూ వచ్చారు. తాజాగా రేవంత్ రెడ్డి నేరుగా తుమ్మల ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. తుమ్మల నాగేశ్వరరావు.. కాంగ్రెస్‌లోకి వస్తే పాలేరు టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ వర్గాలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
అయితే తుమ్మల మాత్రం ఎలాంటి హడావుడి చేయకుండా మౌనంగానే ఉంటూ ముందుకు వెళ్తున్నారు. ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించుకుంటారు. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇటీవల సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ లిస్ట్‌లో తుమ్మల పేరు లేదు. దీంతో ఆయన అనుచరులు పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్నా.. ఆయన మాత్రం చిరునవ్వుతో మౌనరాగం ఆలపిస్తున్నారు. ఏదీ ఏమైనా తాను పోటీలో తప్పకుండా ఉంటానని చెబుతున్నారు. ఇదే ఆయన బ్యాచ్‌కు బూస్ట్ లాంటిదని చెప్పాలి. అయినా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా..? లేదా కమలం గూటిలోకి వెళ్తారా..? లేక కాంగ్రెస్‌లో చేరుతారా..? అన్నది తెలియాల్సి ఉంది. ఇంతకీ తుమ్మల నాగేశ్వరరావు దారెటు..అన్నది సస్పెన్స్‌గా మారింది. ఇదే అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిగ్గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి సహా.. ఇతర నేతలు వెళ్లి.. ఆయనను పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. మరి తుమ్మల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాలి.