Sun Dec 22 2024 21:49:57 GMT+0000 (Coordinated Universal Time)
లక్షతోపాటు తులం బంగారం ఫ్రీ : రేవంత్
ములుగు సభలో రేవంత్ రెడ్డి భారీ ప్రకటన చేశారు. లక్షతో పాటు తులం బంగారాన్ని ఉచితంగా ఇస్తామన్నారు
ములుగు సభలో రేవంత్ రెడ్డి భారీ ప్రకటన చేశారు. కల్యాణ లక్ష్మి పథకం కింద పెళ్లి చేసుకుంటే కుటుంబానికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారాన్ని కూడా ఇస్తామని చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద పెళ్లి చేసుకునే యువతి కుటుంబానికి ఈ రకమైన సాయాన్ని అందిస్తామని రేవంత్ తెలిపారు.
ప్రతి ఆడబిడ్డకు....
కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకం కింద లక్ష నగదుతో పాటు తులం బంగారం కూడా ఉచితంగా ఇస్తామని రేవంత్ ప్రకటించడం కొత్త ప్రకటనగా చూడాలి. తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ మెడలో తులం బంగారం ఉండే బాధ్యతను సోనియా గాంధీ తీసుకుంటారని కూడా రేవంత్ రెడ్డి సభలో స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అమలు చేస్తామని తెలిపారు.
Next Story