Mon Dec 23 2024 14:33:36 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : కేటీఆర్ పై నిప్పులు .. సెటైర్లు వేసిన రేవంత్
సభను తప్పుదోవ పట్టించటానికి కేటీఆర్‌కు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోవడానికి చూస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.
సభను తప్పుదోవ పట్టించటానికి కేటీఆర్‌కు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోవడానికి చూస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. సూచన అనే ముసుగులో మోసం అనే ప్రణాళికను ప్రజల మెదళ్లలో చొప్పిస్తున్నారన్నారు. పదేళ్ల మీ పాలనలో మీ అనుభవాలు మీకు ఉన్నాయని, ప్రజలకు అనుభవాలు ఉన్నాయని అన్నారు. గత పాలన అనుభవాలతో ప్రజలు మాకు అధికారం ఇచ్చారన్న రేవంత్ రెడ్డి పదేళ్లు పాలన చేసినవారు పదినెలలు పూర్తిచేసుకోని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండి పడ్డారు. బతుకమ్మ చీరల పథకంలో అవినీతి జరిగిందని, నేత కార్మికులకు పని కల్పించామంటూ అబద్ధాలు చెప్పారన్నారు. బతుకమ్మ చీరల డబ్బులు బకాయి పెడితే తాము చెల్లించామని తెలిపారు. బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ బినామీలకు అప్పగించారని, సూరత్ నుంచి కిలోల చొప్పున చీరలు తెచ్చి కమీషన్ కొట్టేశారన్నారు.
సిరాజ్ కు గ్రూప్ 1 ఉద్యోగం...
ఎంఎంటీఎస్‌ను విమానాశ్రయం వరకు వేస్తామంటే అనుమతి ఎందుకివ్వలేదని ఆయన ప్రశ్నించారు. దీనివెనుక ఆర్థిక కుట్ర ఏంటో అందరికి తెలియాలని, తామెప్పుడు మీలాగా పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తామని చెప్పలేదన్నారు. హుస్సేన్‌సాగర్ నీళ్లను కొబ్బరినీళ్లలాగా మార్చుతామనలేదన్నారు. స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, టూరిజం హబ్ క్రియేట్ చేస్తామంటున్నామని తెలిపారు. ప్రపంచస్థాయి వైద్యం హైదరాబాద్ నగరంలో అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని, - ఏషియన్ గేమ్స్ నిర్వహించిన హైదరాబాద్‌లో.. స్టేడియమ్స్ అన్నీ తాగుబోతుల అడ్డాగా మారాయని రేవంత్ విమర్శించారరు. నిఖత్ జరీన్‌కు ఉద్యోగం ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదన్న రేవంత్ మహమ్మద్ సిరాజ్‌కు గ్రూప్1 ఉద్యోగం ఇస్తున్నామని తెలిపారు. కేటీఆర్ 100శాతం ఆర్టిఫీషియల్, సున్నా శాతం ఇంటెలిజెన్స్ అంటూ ఫైర్ అయ్యారు.
Next Story