Thu Dec 19 2024 16:48:55 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : రేవంత్ అను నేను
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ రేవంత్ చేత ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ తో పాటు మరికొందరు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ అనే నేను అని అనగానే ఎల్బీ స్గేడియం మొత్తం రేవంత్ జిందాబాద్ అనే నినాదంతో మారుమోగిపోయింది.
మంత్రులుగా...
మంత్రులుగా భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, జూపల్లి కృష్ణారావులు ప్రమాణ స్వీకారం చేశారు. వారి చేత గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. దేవుడి సాక్షిగా కొందరు, మనస్సాక్షిగా మరికొందరు ప్రమాణ చేశారు.
అగ్రనేతలు హజరు...
ఈ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలు వచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లు కూడా ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు. ఎల్బీ స్టేడియానికి పెద్దయెత్తున కాంగ్రెస్ అభిమానులు చేరుకున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జాం ఏర్పడింది. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా వేదికపైకి వచ్చారు.
Next Story