Mon Dec 23 2024 11:13:45 GMT+0000 (Coordinated Universal Time)
మారు వేషంలో రేవంత్ రెడ్డి.. అరెస్ట్
బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లిన రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహస్య మార్గంలె ఆయన అక్కడకు చేరుకున్నారు
బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లిన రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ వద్దకు రహస్య మార్గం ద్వారా ఆయన చేరుకున్నారు. పోలీసులను ఏమార్చి ట్రాక్టర్ లో మాస్క్ వేసుకుని ముళ్ల పొదల్లో నుంచి రేవంత్ రెడ్డి ట్రిపుల్ ఐటీ వద్దకు చేరకుకున్నారు. అయితే క్యాంపస్ వద్దకు చేరుకున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ట్రిపుల్ ఐటీకి చేరుకుని....
బాసర ట్రిపుల్ ఐటీకి మహారాష్ట్రలోని ధర్మాబాద్, బాలాపూర్, మీదుగా ట్రిపుల్ ఐటీ వద్దకు చేరుకు్నారు. ట్రాక్టర్ లో వచ్చిన రేవంత్ రెడ్డి తర్వాత చెరువులో నుంచి కాలినడక ద్వారా ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. పోలీసుల కళ్లుగప్పి క్యాంపస్ గోడ దూకి లోపలకి చేరుకున్నారు. లోపల విద్యార్థుల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. తాను విద్యార్థులతో మాట్లాడాలని రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని పోలీసులు తోసి పుచ్చారు.
Next Story