Sun Dec 22 2024 17:16:42 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నికల బరిలో రేవంత్ సతీమణి?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో రేవంత్ సతీమణిని పోటీకి దించాలని
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో రేవంత్ సతీమణిని పోటీకి దించాలని రేవంత్ వర్గీయులు ఆకాంక్షిస్తున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది కాలంగా రేవంత్ అభిమానులు, సలహాదారులు గీత రెడ్డిని ఈ ఎన్నికలలో పోటీ చేసేలా ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. రేవంత్ కూడా గీత రెడ్డి పోటీకి అభ్యంతరాలు ఏవీ వ్యక్తం చేయలేదట. వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రతిష్టాత్మకం కాబట్టి.. ముందు పార్టీ, పార్టీలోని కీలక నేతలు, ఆశావహులను సర్దుబాటు చేశాక ఏమాత్రం ఛాన్స్ ఉన్నా గీతా రెడ్డికి అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నారట రేవంత్ రెడ్డి.
2018లో కొడంగల్‌లో ఓడిపోయి ఆ తర్వాత మల్కాజ్గిరి ఎంపీగా గెలిచారు రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్మికలలో రేవంత్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేక తిరిగి ఎంపీగా చేస్తారా అనేది క్వశ్చన్ మార్క్. ఆ నిర్ణయం కాంగ్రెస్ హైకమాండ్ చేతుల్లో ఉందని రేవంత్ పలుమార్లు స్పష్టం చేశారు. రేవంత్ ఒకవేళ ఎంపీగానే పోటీ చేయాలి అని నిర్ధారిస్తే.. అతని భార్య గీతా రెడ్డిని కొడంగల్ నుంచి పోటీకి దించే అవకాశాలు ఏర్పడవచ్చు. ఒకవేళ రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేయాల్సి వస్తే గీతా రెడ్డికి ఉన్న ఒక్క అవకాశం జడ్చర్ల అని సూచన చేశారట రేవంత్ సన్నిహిత వర్గం వాళ్ళు. ఈబేడాది జనవరిలో ఒకసారి గీత రెడ్డి పోటీ విషయాన్ని ప్రస్తావించినప్పుడు మల్లు రవి కూడా జడ్చర్లలో ఆమె పోటీ చేస్తే సపోర్ట్ చేస్తానని చెప్పినట్టు స్థానికంగా పార్టీ వర్గాల్లో చర్చలు జరిగాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మల్లు రవి సీఎం రేస్‌లో ఉన్నారు. కర్నాటక ఎన్నికల తర్వాత మల్లు రవి, రేవంత్‌లు ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. రాష్డ్రంలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి, ఆశావహులు, కీలక నేతలు తమ గెలుపుకోసం వర్గపోరులు మొదలుపెట్టారు. స్టేట్ పార్టీలో కూడా ఇప్పుడు మల్లు రవి పట్టు చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇలాంటి సమయంలో గీత రెడ్డి పోటీకి అనుకూల వాతావరణం ఏర్పడుతుందా అనే సందేహాలు రేగుతున్నాయి. గీత రెడ్డికి అవకాశం దొరికితే పార్టీకి మరో చరిష్మాటిక్ లీడర్ యాడ్ అవుతుంది. మిసస్ రేవంత్ బ్రాండ్‌తో గీతరెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో స్టార్ క్యాంపేయినర్‌గా వ్వవహరిస్తే రేవంత్‌కు, కాంగ్రెస్ పార్డీకీ గ్రాఫ్ పెరిగే అవకాశాలే ఉన్నాయి. కానీ ఆమె పోటీ చేయాలంటే అనువైన రెండు నియోజకవర్గాలు కొడంగల్, జడ్చర్లలు రెండే.. ఇప్పటికే వర్గపోరుతో నలుగుతున్న కాంగ్రెస్ పార్టీకి గీత రెడ్డి టికెట్ తలనొప్పిగా మారుతుందేమోనన్న అనుమానం కలగక మానదు...
Next Story