Thu Dec 19 2024 23:07:50 GMT+0000 (Coordinated Universal Time)
రేపు ఐదుగురు మంత్రుల ప్రమాణం.. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు రాగానే రేవంత్‌కు పిలుపు
రేపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు
రేపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిసింది. ఈ ఐదుగురు సీనియర్ నేతలుంటారని తెలిసింది. వీరిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని తెలుస్తోంది.
తిరిగి ఏఐసీసీ భవన్ కు...
కాగా ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు చేరుకునేందుకు ఎయిర్ పోర్టుకు చేరుకోగానే అధినాయకత్వం నుంచి మళ్లీ పిలుపు వచ్చింది. దీంతో ఆయన మళ్లీ ఏఐసీసీ కార్యాలయానికి వెనుదిరిగి వెళ్లారు. కేబినెట్ కూర్పుపై రేవంత్‌తో చర్చించేందుకు తిరిగి ఆయన ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి వెళ్లారు. మంత్రి వర్గ విస్తరణ మరోసారి ఉంటుందని చెబుతున్నారు.
Next Story