Mon Dec 23 2024 00:18:16 GMT+0000 (Coordinated Universal Time)
Tummala : తుమ్మల ఇంట్లో సోదాలు
కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో తనిఖీలు జరుగుతున్నాయి
కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఆయన ఇంట్లో పెద్దయెత్తున డబ్బులు దాచి పెట్టారన్న సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడానికే డబ్బులు పెద్దమొత్తంలో దాచి ఉంచారని ఫిర్యాదు అందడంతోనే దాడులు నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు.
డబ్బులున్నాయని...
అయితే ఈ దాడులను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండిస్తున్నారు. కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయని తెలిపారు. కేవలం కాంగ్రెస్ అభ్యర్థులనే టార్గెట్ గా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఫ్లైయింగ్ స్క్కాడ్లుగా విడిపోయి ఈ సోదాలు జరిపారని, ఇది కరెక్ట్ కాదని తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
Next Story