Mon Dec 23 2024 07:05:22 GMT+0000 (Coordinated Universal Time)
వరద గోదారి .. మునిగిన స్నానఘట్టాలు
అప్రమత్తమైన అధికారులు నదిలో వేటకు వెళ్లొద్దని జాలర్లను హెచ్చరించారు. రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు స్నానాలు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం సాయంత్రానికి 20 అడుగులు ఉన్న నది నీటిమట్టం.. బుధవారం మధ్యాహ్నం 1 గంట వరకూ.. 28.9 అడుగులకు చేరింది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు వదలడంతో రానున్న 24 గంటల్లో వరద గరిష్ఠంగా పెరిగే సూచనలున్నాయని అధికారులు చెబుతున్నారు. వరద నీరు పెరుగుతుండటంతో.. భద్రాచలం వద్ద భక్తులు స్నానాలు చేసే స్నాన ఘట్టాలు మునిగిపోయాయి.
అప్రమత్తమైన అధికారులు నదిలో వేటకు వెళ్లొద్దని జాలర్లను హెచ్చరించారు. రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు స్నానాలు చేసేందుకు నదిలో లోతుకు వెళ్లరాదని హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశారు. తీర ప్రాంతంలో అధికారులు ఎప్పటికప్పుడు నది నీటి మట్టాన్ని సమీక్షిస్తూ.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు సమాచారం అందించాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో కలెక్టర్ పరిశీలిస్తున్నారు.
Next Story