Mon Dec 23 2024 13:36:14 GMT+0000 (Coordinated Universal Time)
మందుబాబుల తప్పిదం..మొయినాబాద్ లో ఘోర ప్రమాదం
మొయినాబాద్ నుంచి చేవెళ్ల వెళ్తోన్నకారుకు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ప్రేమిక (16) అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
తప్పతాగి అనేక రోడ్డుప్రమాదాలకు కారణమవుతున్నారు మందుబాబులు. అందులోనూ.. వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఇంకా రెచ్చిపోతున్నారు. ఫుల్లుగా తాగి ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపి.. అనేకమంది ప్రాణాలను హరిస్తున్నారు. తాజాగా మొయినాబాద్ లో జరిగిన రోడ్డుప్రమాదంలో మరో ప్రాణం బలైంది. వివరాల్లోకి వెళితే.. మొయినాబాద్ నుంచి చేవెళ్ల వెళ్తోన్నకారుకు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ప్రేమిక (16) అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఒకే కుటుంబానికి చెందిన వారే
ప్రమాదంలో గాయపడిన సామ్య (18), అక్షర (14)లను పోలీసులు చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు యువతుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు.. 24 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమన్నారు. కాగా.. అక్షర 9వ తరగతి చదువుతుండగా.. సౌమ్య డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. వీరంతా మొయినాబాద్ కు చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. ముగ్గురు యువతులు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు కావడంతో.. ఆ కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story