Fri Dec 20 2024 11:10:31 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident: శామీర్ పేటలో ఘోర రోడ్డు ప్రమాదం
శామీర్ పేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది
శామీర్ పేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురి ప్రాణాలు పోయాయి. ఓ కారు బీభత్సం సృష్టించిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసి బస్సును తప్పించబోయి బోల్తా పడింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జు అయ్యింది. అతి వేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
అంతకు ముందు రోజు సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై టాటా అల్ట్రా డీసీఎం లారీని వెనుక నుంచి అతి వేగంగా వచ్చి బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అభిషేక్, సందీప్, నవీన్ అనే ముగ్గురు యువకులు కందిలోని అక్షయ పాత్ర కిచెన్ లో కార్మికులుగా పనిచేస్తున్నారు. గురువారం తెల్లవారుజామున ముగ్గురు కలిసి ఒకే బైక్ పై కందికి విధులకు బయల్దేరినప్పుడు ఈ ప్రమాదం జరిగింది.
Next Story