Wed Nov 06 2024 01:25:19 GMT+0000 (Coordinated Universal Time)
కవితను విచారించనున్న సీబీఐ అధికారులు.. మూడు రోజుల పాటు
సీబీఐ కస్టడీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది.
సీబీఐ కస్టడీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు కల్వకుంట్ల కవితను కోర్టులో సీబీఐ అధికారులు హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఐదు రోజుల కస్డడీకి సీబీఐ అధికారులు కోరారు. కవితను విచారించాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం తమకు ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని కోరింది. కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక సూత్రధారి అని సీబీఐ తరుపున న్యాయవాదులు పేర్కొన్నారు.
మూడు రోజులు...
అయితే మూడు రోజులు మాత్రమే విచారణ నిమిత్తం కవితను సీబీఐ కస్టడీకి అప్పగించాలని ని కోర్టు ఆదేశించింది. ఈ నెల 14వ తేదీ వరకూ కవితను సీీబీఐ విచారించనుంది. తిరిగి ఈ నెల 15వ తేదీన ఉదయం పదిగంటలకు కోర్టులో కవితను హాజరుపర్చనున్నారు. దీంతో కవితను సీబీఐ ప్రధాన కార్యాలయానికి సీబీఐ అధికారులు తీసుకెళ్లారు. కవిత తరుపున వేసిన పిటీషన్లన్నింటినీ న్యాయస్థానం కొట్టివేసాింది.
Next Story