Mon Dec 23 2024 01:06:02 GMT+0000 (Coordinated Universal Time)
ముగిసిన చలాన్ల గడువు.. 45 రోజుల్లో రూ.302 కోట్లు వసూలు
ఆఖరిరోజు కావడంతో.. నిన్న భారీగా పెండింగ్ చలాన్లు వసూలయ్యాయి. తొలుత మార్చి 1 నుంచి 31 వరకే డిస్కౌంట్లు
హైదరాబాద్ : వాహనాలపై కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన పెండింగ్ చలాన్లను రాయితీపై చెల్లించేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు నిన్న సాయంత్రానికి ముగిసింది. ఆఖరిరోజు కావడంతో.. నిన్న భారీగా పెండింగ్ చలాన్లు వసూలయ్యాయి. తొలుత మార్చి 1 నుంచి 31 వరకే డిస్కౌంట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో 15 రోజులపాటు గడువును పెంచారు. దీంతో గతంలో చెల్లించలేకపోయిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
శుక్రవారం రాత్రి 8.30 గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ.302 కోట్లు వసూలయ్యాయి. మొత్తం 5 కోట్ల పెండింగ్ చలాన్లకు గాను.. 3 కోట్ల చలానాలు వసూలైనట్లు ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. మొత్తం రూ.1,015 కోట్ల చలానాలు జారీ చేయగా, రాయితీ పోను రూ. 302 కోట్లు వసూలైనట్లు పేర్కొన్నారు.
Next Story