Mon Dec 23 2024 02:46:29 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఫిట్నెస్ లేకుండానే రోడ్లపైకి స్కూలు బస్సులు
ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రాలు లేకుండానే రోడ్లపైకి స్కూల్ బస్సులు వస్తుండటంతో ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు
ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రాలు లేకుండానే రోడ్లపైకి స్కూల్ బస్సులు వస్తుండటంతో ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో 23,824 విద్యాసంస్థల బస్సులు ఉంటే వీటిలో 14,170 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారని అధికారులు చెబుతున్నారు. ఇంకా 9,654 బస్సులు ఇంకా ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రాలు పొందలేదని, హైదరాబాద్లో 1,290 బస్సులు ఉండగా 904 బస్సులు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకున్నాయని అధికారులు తెలిపారు.
పాఠశాలలు ప్రారంభం కావడంతో...
తెలంగాణలో పాఠశాలలు ప్రారంభం కావడంతో స్కూల్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయని రవాణాశాఖ అధికారులకు ఫిర్యాదులు రావడంతో పాఠశాలల ప్రారంభం రోజే రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి నడుపుతున్న బస్సులను తనిఖీ చేశారు. ఫిట్నెస్ సర్టిఫికెట్లతో పాటు బస్సుల కండీషన్ ను పరిశీలించారు. ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఇన్సూరెన్స్, పర్మిట్, అటెండర్ లేని బస్సులపై కేసులు నమోదు చేశారు.
Next Story