Sun Dec 22 2024 17:28:52 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్టీసీ బస్సులోనే ప్రసవం... కండక్టర్ ను మెచ్చుకున్న ఎండీ సజ్జనార్
ఆర్టీసీ బస్సు కండక్టర్ తో పాటు ఆ బస్సులో ప్రయాణిస్తున్న నర్సు ఒకరు కలసి ఆ మహిళకు డెలివరీ చేయగలిగారు
ఆర్టీసీ బస్సులో ఒక మహిళ ప్రయాణిస్తుండగా పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే ఆర్టీసీ బస్సు కండక్టర్ తో పాటు ఆ బస్సులో ప్రయాణిస్తున్న నర్సు ఒకరు కలసి ఆ మహిళకు డెలివరీ చేయగలిగారు. దీంతో తల్లి, బిడ్డ సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవానికి సహకరించి డ్రైవర్ ను సజ్జనార్ అభినందించారు.
రక్షాబంధన్ రోజు...
ఆర్టీసీ అంటే ప్రయాణికులను క్షేమంగా చేరుస్తూ సామాజిక బాధ్యతగా వ్యవహరిస్తున్న వీరికి వందనం అంటూ ఆయన ట్వీట్ చేశారు. శభాష్ భారతీ అంటూ ఆయన ట్వీట్ చేశారు. రక్షాబంధన్ రోజు యాధృచ్చికంగా జరిగిన ఘటనే అయినా సకాలంలో డెలివరీ చేసి రెండు ప్రాణాలను కాపాడగలిగారన్నారు.
Next Story