Mon Dec 23 2024 03:49:01 GMT+0000 (Coordinated Universal Time)
కారు - ఆటో ఢీ .. సజ్జనార్ కు స్వల్పగాయాలు
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. సజ్జనార్ కు కూడా స్వల్ప గాయలయ్యాయి. పెద్దపల్లి జిల్లాలోని పాలకూర్తి మండలం ధర్మారం క్రాస్ రోడ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మహారాష్ట్ర వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఆటో అడ్డురావడంతో...
క్రాస్ రోడ్స్ లో ఒక్కసారిగా ఆటో అడ్డురావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో రామగుండం మండలం మల్యాల పల్లి గ్రామానికి చెందిన నాలరాజు, లక్ష్మిలకు తీవ్రగాయాలకు కాగా వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సజ్జనార్ కుడి చేతి వేలుకు కూడా స్వల్ప గాయమయిందని పోలీసులు చెప్పారు.
Next Story