Tue Feb 11 2025 18:34:52 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేటి నుంచి రైతుల ఖాతాల్లో నగదు
తెలంగాణలో రైతులకు రైతు భరోసా నిధులు అర్ధరాత్రి నుంచి వారి ఖాతాల్లో పడటం ప్రారంభమయ్యాయి.
తెలంగాణలో రైతులకు రైతు భరోసా నిధులు అర్ధరాత్రి నుంచి వారి ఖాతాల్లో పడటం ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి రైతు భరోసా నిధులు అర్హులైన రైతుల ఖాతాల్లో పడనుంది. రైతు భరోసా అమలు చేయడానికి ప్రభుత్వం అవసరమైన ఏడు వేల కోట్ల రూపాయల నిధులను ఇటీవలే సిద్ధం చేసి లబ్దిదారుల ఖాతాల్లో వేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది.
తొలివిడతగా...
ఈ మేరకు అధికారులు నిన్న ఆదివారం కావడంతో నేటి నుంచి రైతుల ఖతాల్లో నగదు జమ అవుతుంది. యాసంగి పెట్టుబడి సాయం కింద తొలి విడతగా రైతుభరోసా నిధులను ఆరువేల రూపాయల చొప్పున తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. నిన్న అధికారికంగా ప్రారంభించినప్పటికీ నేటి నుంచి ఈ పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని అధికారులు తెలిపారు.
Next Story