Mon Dec 23 2024 13:49:11 GMT+0000 (Coordinated Universal Time)
భద్రాద్రి రామయ్య ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం.. ప్రసాదాల విక్రయంలో కక్కుర్తి
దాదాపుగా 50 వేల లడ్డూల వరకూ మిగిలిపోయాయి. దాంతో.. లడ్డూలను తయారు చేసి వారంరోజులపైనే కావొస్తుండటంతో..
భద్రాచలంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో.. భక్తుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి బయటపడింది. ఆలయానికి వచ్చిన భక్తులకు.. ప్రసాదంగా విక్రయించే లడ్డూల్లో అధికారులు తమ కక్కుర్తిని చూపించారు. బూజుపట్టిన లడ్డూలను విక్రయించారు. స్వామివారి ప్రసాదాన్ని తినాలని లడ్డూతీసి చూసిన భక్తులు షాకయ్యారు. బూజుపట్టిన లడ్డూలను విక్రయించడంపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు.
జనవరి 2వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా.. అధికారులు అదనంగా లడ్డూలను సిద్ధం చేశారు. అవి పూర్తిస్థాయిలో విక్రయం కాలేదు. దాదాపుగా 50 వేల లడ్డూల వరకూ మిగిలిపోయాయి. దాంతో.. లడ్డూలను తయారు చేసి వారంరోజులపైనే కావొస్తుండటంతో.. అవి బూజు పట్టిపోయాయి. వాటిని పక్కన పెట్టి.. కొత్తలడ్డూలను తయారు చేయించి విక్రయించాల్సిన అధికారులు..తమ వక్రబుద్ధిని చూపించారు. బూజుపట్టిన లడ్డూలనే భక్తులకు విక్రయించడంతో.. ఆలయ అధికారులపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫంగస్ ఉన్న లడ్డూలు తిని, భక్తులకు ఫుడ్ పాయిజన్ అయితే, ఎవరిది బాధ్యత అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీని డిమాండ్ చేశారు.
Next Story