వందేళ్ల మర్రి చెట్టు.. ఉంచారా.. పీకారా?
100 ఏళ్ల మర్రి చెట్టుకు అలా ప్రాణం పోసారు
తెలంగాణ రాష్ట్రంలో 100 ఏళ్ల వయసు ఉన్న మర్రి చెట్టుకు మళ్లీ ప్రాణం వచ్చింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఈ ఏడాది ప్రారంభంలో ప్లాట్స్ వేసే సమయంలో కొంతమంది రియల్టర్లు ఆ మర్రిచెట్టును నరికివేశారు. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న చెట్టు అది. అయితే ప్రకృతి ప్రేమికులంతా కలిసి ఆ చెట్టుకు తిరిగి జీవం పోశాడు. దాదాపు 10 అడుగుల వెడల్పు.. 20 టన్నులకు పైగా బరువున్న మర్రి చెట్టును క్రేన్ల సాయంతో పైకి లేపి ఓ ప్రైవేట్ స్థలంలోకి తరలించారు. భారీ మల్టీ యాక్సిల్ ట్రక్కులో 54 కిలోమీటర్ల దూరం తీసుకుని వెళ్లారు. అనిల్, అతని స్నేహితులు కలిసి చెట్టుకు ప్రాణం పోశారు. మే 30న మేడ్చల్ మల్కాజ్గిరిలోని ఘట్కేసర్ సమీపంలోని నా మిత్రుడు అనిల్ సొంతూరు ఘన్పూర్కి వెళ్లే దారిలో రోడ్డు పక్కన ఉన్న మర్రి చెట్టును చూశాను.. దాన్ని చూసిన వెంటనే దాన్ని బతికించడానికి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను. నేను నా స్నేహితులను సంప్రదించి.. ఆ చెట్టును ఎక్కడకు తీసుకుని రావాలి.. ఎలా బతికించాలి అనే అంశంపై చర్చించానని అనిల్ అన్నారు.