Mon Dec 23 2024 00:08:49 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ హైకోర్టు సీజే గా ఉజ్జల్ భుయాన్..
ఐదు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్ ల నియమకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్స్ చేసింది. తెలంగాణతోపాటు ఉత్తరాఖండ్
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఆయన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయాలని కొలీజియం చేసిన సిఫారసుల దృష్ట్యా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం భావించింది. జస్టిస్ భుయాన్ 17 అక్టోబర్ 2011న గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ భుయాన్ 2011-17 అక్టోబర్ గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మిజోరాం స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా ఉన్నారు. 2019లో బాంబే హైకోర్టుకు బదిలీ అయిన ఆయన జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. 2021, అక్టోబర్‌లో తెలంగాణ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియమితులయ్యారు.
ఐదు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్ ల నియమకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్స్ చేసింది. తెలంగాణతోపాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గువాహటి రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలను నియమించనున్నారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ విపిన్ సంఘీని ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా నియమించారు. బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అమ్జద్ ఎ.సయిూద్ ను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సీజేగా నియామకం అయ్యారు. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రష్మిన్ ఎం.ఛాయాను గువాహటి హైకోర్టు సీజేగా నియమించారు. బాంబే హైకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎస్ షిండే రాజస్థాన్ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. జస్టిస్ సతీశ్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలన్న కొలీజియం ఆయన స్థానంలో జస్టిస్ భుయాన్‌కు పదోన్నతి కోసం సిఫారసు చేసింది.
Next Story