Mon Dec 23 2024 11:03:14 GMT+0000 (Coordinated Universal Time)
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ లో మార్పులు
జేఈఈ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల కావడంతో దానికనుగుణంగా ఇంటర్ పరీక్షల తేదీలను మార్పు చేసింది.
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల కావడంతో దానికనుగుణంగా ఇంటర్ పరీక్షల తేదీలను మార్పు చేసింది. ఏప్రిల్ 21వ తేదీన ఇంటర్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఏప్రిల్ 22 మే 11 వ తేదీ వరకూ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే ఏప్రిల్ 23 నుంచి మే 12వ తేదీ వరకూ ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరుగుతాయి.
జేఈఈ మెయిన్స్.....
మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకూ ప్రాక్టికల్స్ జరుగుతాయి. అలాగే ఏప్రిల్ 11న ఎథిక్స్, 12వ తేదీన హ్యూమన్ వాల్యూ పరీక్షలు నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీలకు అనుగుణంగా ఇంటర్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు.
Next Story