Sun Dec 22 2024 20:10:17 GMT+0000 (Coordinated Universal Time)
రేపటి నుంచే సెలవులు
తెలంగాణలో రేపటి నుంచే పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి
తెలంగాణలో రేపటి నుంచే పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు ఈ నెల 13 నుంచి అక్టోబరు 25 వరకూ సెలవులు కొనసాగుతాయి. 26వ తేదీ నుంచి తిరిగి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. కళాశాలలకు మాత్రం ఈ నెల 19వ తేదీ నుంచి సెలవులు ప్రారంభవుతాయి.
పెద్ద పండగ కావడంతో...
ప్రభుత్వం తొలుత ఈ నెల 15 నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అయితే ఆ తర్వాత దసరా సెలవులను మరిన్ని ఇవ్వాలని భావించి ఈ నెల 13 నుంచి సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి పాఠశాలలన్నీ దాదాపు పన్నెండు రోజుల పాటు మూతబడతాయి. తెలంగాణలో దసరా అతి పెద్ద పండగ కావడంతో విద్యాసంస్థలకు ఎక్కువ సెలవులను ప్రకటించారు.
Next Story