Fri Jan 10 2025 04:32:42 GMT+0000 (Coordinated Universal Time)
సోమవారం వరకూ తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు
తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు
తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో విద్యా సంస్థలు గురువారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో పాటూ.. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో విద్యా సంస్థల సెలవులను మరో మూడు రోజుల పాటు పొడగించనున్నారు. గురు, శుక్ర, శనివారం సెలవులు ప్రకటించి.. సోమవారం నుంచి విద్యా సంస్థలను పునఃప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు కొనసాగుతున్న దృష్ట్యా, రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఈ వారంలో మరో మూడు రోజులు సెలవులు ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాఠశాలలు సోమవారం తిరిగి తెరవబడతాయి. బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వీ కరుణ ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
News Summary - Schools in Telangana to remain shut till Monday
Next Story