Sat Mar 22 2025 16:22:20 GMT+0000 (Coordinated Universal Time)
SlBC Opration : శునకాలు జాడ కనుగొన్నా.. తవ్వకాలు జరపడం అసాద్యమేనట
శ్రీశైలం ఎడమ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో కార్మికుల జాడ కోసం ఇంకా గాలింపు కొనసాగుతుంది.

శ్రీశైలం ఎడమ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో కార్మికుల జాడ కోసం ఇంకా గాలింపు కొనసాగుతుంది. గత పదిహేను రోజుల నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. క్యాడవర్ డాగ్స్ తో నిన్న టన్నెల్ లోకి వెళ్లిన బృందాలు మృతదేహాలు ఉండే ప్రాంతాన్ని గుర్తించాయి. అయితే మూడు మృతదేహాలను గుర్తించిన కేరళ నుంచి తీసుకు వచ్చిన డాగ్స్ అక్కడ గతంలో సహాయక బృందాలు మార్క్ చేసిన చోటనే ఆనవాళ్లు గుర్తించాయి. అయితే అక్కడ తవ్వకాలు జరిపేందుకు కష్టంగా మారింది. నీరు పైపైకి ఉబికి వస్తుండటంతో ఇబ్బందిగా మారింది. ఎనిమిది అడుగుల మేరకు తవ్వకాలు జరిపినా మృతదేహాల జాడ కనిపించడ లేదు. దీంతో ఏం చేయాలన్న దానిపై మరొక ప్లాన్ ను నేడు ఆపరేషన్ బృందం అమలు చేయనుంది.
నిర్విరామంగా...
పదకొండు బృందాలు నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపడుతున్నా ఏ మాత్రం ఆచూకీ కూడా లేదు. టన్నెల్ లోపల ఆక్సిజన్ అందక ఎనిమిది మంది మరణించి ఉంటారని దాదాపుగా సహాయక బృందాలు నిర్ధారణకు వచ్చాయి. అదే సమయంలో మృతదేహాలను బంధువులకు అప్పగించేందుకు మాత్రమే ఈ ఆపరేషన్ కొనసాగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పదిహేను రోజులు కావడంతో నీరు, ఆహారం లేకుండా జీవించి ఉండటం అసాధ్యమని సహాయక బృందాలు డిసైడ్ అయ్యాయి. లోపలికి వెళ్లిన వారికి కనీసం శబ్దాలు కూడా రాకపోవడంతో వారు జీవించి ఉండరన్నది వందశాతం బృందాలు తేల్చాయి.
నేడు టన్నెల్ వద్దకు...
మరొకవైపు నేడు ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించే అవకాశముందని తెలిసింది. ఈరోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాదం జరిగిన ప్రాంతాలన్ని పరిశీలించనున్నారు. ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. లోపల ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు పదిహేను రోజుల క్రితం చిక్కుకోవడంతో వారి బంధువులకు పరిహారాన్ని ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. శునకాలు కూడా వెళ్లి అక్కడ మార్క్ చేసిన ప్రాంతాన్ని తవ్వేందుకు కూడా కష్టంగా మారడంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి పెట్టారు. టీబీఎం మిషన్ శిధిలాలను తొలగించడం, కన్వేయర్ బెల్ట్ ను పునరుద్ధరించడం సహాయక బృందాలకు సవాలుగా మారింది.
Next Story