Sun Dec 22 2024 21:31:50 GMT+0000 (Coordinated Universal Time)
ఐటీ శాఖ సోదాల్లో 12 కోట్ల స్వాధీనం
మంత్రి సబితాఇంద్రారెడ్డి అనుచరుడి ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు ముగిసాయి.
మంత్రి సబితాఇంద్రారెడ్డి అనుచరుడి ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు ముగిసాయి. గత మూడు రోజుల నుంచి ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలోనూ, ఫార్మా కంపెనీల ఛైర్మన్లు, సీఈవో, డైరెక్టర్ల ఇళ్లలోనూ ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పలు కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.
వీరి ఇంటి నుంచి...
ఈ సోదాల్లో సబితా ఇంద్రారెడ్డి బంధువు ప్రదీప్ రెడ్డి ఇంట్లో 7.50 కోట్ల రూపాయలు లెక్క చూపని నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈయనతో పాటు రెడ్డి ల్యాబ్స్ ఉద్యోగి నరేందర్ రెడ్డి ఇంట్లో కూడా ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించారు. వీరి ఇంటి నుంచి ఐదు కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Next Story