Sun Dec 22 2024 11:43:45 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Assembly : సర్కార్ అప్పులపై బీఆర్ఎస్ వాకౌట్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయిన తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయిన తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఏడాదిలో చేసిన అప్పులెన్ని అంటే వేసిన ప్రశ్నపై రగడ జరిగింది. ఈ సందర్భంగా సరైన సమాధానం అధికార పార్టీ చెప్పలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఏడాది పాలనలో చేసిన అప్పు రూ. 1,27,208 కోట్ల రూపాయలు అని హరీశ్ వారు అన్నారు.
వచ్చే ఐదేళ్లలో...
ఇలాగే అప్పులు కొనసాగితే వచ్చే ఐదేళ్లలో అయ్యే అప్పు 6,36,040 కోట్ల రూపాయలు అవుతాయని, అయితే బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో చేసిన మొత్తం అప్పు 4,17,496 కోట్ల రూపాయలు మాత్రమేనని హరీశ్ రావు అన్నారు. దీనికి మల్లు భట్టి విక్రమార్క అభ్యంతరం తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ చెల్లించేందుకు అప్పులు చేయాల్సి వస్తుందన్నారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.
Next Story