Mon Dec 23 2024 19:42:25 GMT+0000 (Coordinated Universal Time)
Lasya Nanditha : లాస్యకు వరస ప్రమాదాలు... అవి వార్నింగ్ బెల్స్ అని అనుకోవాలా?
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు వరస ప్రమాదాలు జరుగుతున్నాయి
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు వరస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ కారు కలసి రావడం లేదని అనిపిస్తుంది. ఈ నెల 13న నల్లగొండ సభకు హాజరయి వస్తున్న సమయంలోనూ లాస్య ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. నల్లగొండ బీఆర్ఎస్ సభకు హాజరై వస్తుండగా లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ఒక హోంగార్డును ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి లాస్య నందిత తృటిలో తప్పించుకున్నారు. అప్పుడు కూడా అతి వేగమే కారణమని చెప్పారు.
లిఫ్ట్ లో చిక్కుకుని...
అలాగే కొంతకాలం క్రితం లాస్య నందిత లిఫ్ట్ లో చిక్కుకుని ఇబ్బంది పడ్డారు. ఓవర్‌లోడ్ కావడంతో లాస్య నందిత ఉన్న లిఫ్ట్ ఆగిపోయింది. అయితే అప్పుడు ఎమ్మెల్యే ను వెంటనే సిబ్బంది రక్షించగలిగారు. వెనువెంటనే జరిగిన రెండు ప్రమాదాల నుంచి తప్పించుకున్న లాస్య నందిత ఈసారి మాత్రం మృత్యువును జయంచలేక పోయింది. ఆమె కారు వరస ప్రమాదాలకు గురవుతున్నా ఆమె కారును మార్చలేదంటూ బంధువులు విలపిస్తున్నారు. దీన్ని బట్టి ఆమెను గత కొద్ది రోజులుగా మృత్యువు వెంటాడుతున్నట్లే కనిపిస్తుంది.
కార్పొరేటర్ గా...
లాస్య నందిత తండ్రి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పనిచేశారు. సుదీర్ఘకాలంలో రాజకీయాల్లో ఉన్న సాయన్న వివాదరహితుడిగా పేరు పొందారు. అయితే ఆయన మరణించిన ఏడాది తిరగకముందే ఎన్నికలు రావడంతో సాయన్న కుటుంబంలోని లాస్యకు టిక్కెట్ కేసీఆర్ ఇచ్చారు. లాస్య గతంలో కార్పొరేటర్ గా కూడా గెలిచారు. కవాడిగూడ కార్పొరేటర్‌గా సేవలంందించారు. 37 ఏళ్ల లాస్య నందిత మరణంతో పార్టీలోనూ, కుటుంబంలోనూ తీవ్ర విషాదం నింపింది. పోలీసులు ప్రమాదానికి గల కారణాలను గుర్తించే పనిలో ఉన్నారు.
Next Story