Mon Dec 23 2024 12:29:45 GMT+0000 (Coordinated Universal Time)
సికింద్రాబాద్ - తిరుపతి టిక్కెట్ ధర ఎంతంటే?
సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రేపటి నుంచి నడవనుంది.
సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రేపటి నుంచి నడవనుంది. దీంతో తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. కేవలం ఎనిమిదన్నర గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చేరుకుంటుంది. ఉదయం సికింద్రాబాద్ స్టేషన్లో 6 గంటలకు బయలుదేరిన రైలు మొత్తం 660 కిలోమీటర్లు ప్రయాణించి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటుంది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు.
8.30 గంటల్లోనే...
సికింద్రాబాద్, నల్లగొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో మాత్రమే వందేభారత్ రైలు ఆగనుంది. మంగళవారం మినహాయించి మిగిలిన అన్ని రోజులలో ఈ రైలు ప్రయాణిస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ - తిరుపతి ఛైర్‌కార్ టికెట్ ధర రూ. 1680 గా రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ రైలును ఎక్కువమంది వినియోగించుకుంటారని రైల్వే శాఖ ఆశాభావం వ్యక్తం చేస్తుంది.
Next Story