Tue Apr 15 2025 15:06:39 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్
తెలంగాణ రాజ్యసభ అభ్యర్థిగా నేడు కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

తెలంగాణ రాజ్యసభ అభ్యర్థిగా నేడు కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం పది గంటలు ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొననున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కే. కేశవరావు తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక జరగనుంది.
ఈ నెల 3న ఎన్నిక...
అయితే రాజ్యసభ పదవికి కాంగ్రెస్ అధినాయకత్వం అభిషేక్ సింఘ్వీని ఎంపిక చేసింది. నిన్న సీఎల్పీ సమావేశం పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింఘ్వీని శాసనసభ్యులకు పరిచయం చేశారు. వచ్చే నెల 3వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. అయితే ఈ ఎన్నికలో బీఆర్ఎస్ పోటీ చేసే అవకాశాలు లేకపోవడంతో అభిషేక్ మను సింఘ్వి ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయి.
Next Story