Mon Dec 23 2024 13:43:33 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ కు బాసటగా సీనియర్లు
రేవంత్ రెడ్డి పాదయాత్రపై బీఆర్ఎస్ నేతలు రాళ్ల దాడి చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలు తప్పుపడుతున్నారు
రేవంత్ పాదయాత్రపై బీఆర్ఎస్ నేతలు రాళ్ల దాడి చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలు తప్పుపడుతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిన్న భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో పాదయాత్ర చేస్తుండగా ఆయన పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగా టమాటాలు, కోడిగుడ్లతో కొందరు దాడి చేశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సయితం తిరిగి రాళ్లు రువ్వారు. ఈ దాడిలో పలువురికి స్వల్పగాయాలయ్యాయి.
రేవంత్ పాదయాత్రపై....
పోలీసులు ఇరు వర్గాలను సముదాయించడానికి ఎంత ప్రయత్నించినా రాళ్లు పడుతూనే ఉన్నాయి. దీంతో అనేక మంది రాళ్ల దాడి నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీశారు. దీనిపై రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. తమ పై దాడి చేసిన బీఆర్ఎస్ నేతలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సీనియర్ నేత వి.హనుమంతరావు సయితం రేవంత్ పాదయాత్రపై బీఆర్ఎస్ శ్రేణుల దాడిని ఖండించారు. కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడితే తట్టుకోలేరని హెచ్చరించారు. అలాగే పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు రేవంత్ పాదయాత్రపై జరిగిన దాడిని ఖండించారు.
Next Story