Mon May 05 2025 21:48:43 GMT+0000 (Coordinated Universal Time)
స్మితా సబర్వాల్ ఎప్పుడూ ఇంతేనా?
సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సివిల్ సర్వీసెస్ కు దివ్యాంగుల కోటా ఎందుకంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ట్విటర్లో ప్రశ్నించారు. 'దివ్యాంగులంటే పూర్తి గౌరవం ఉంది. కానీ విమానయాన సంస్థలు పైలట్లుగా, ఆస్పత్రులు వైద్యులుగా దివ్యాంగుల్ని నియమించుకోగలమా ? అంటూ ప్రశ్నించారు.
వివాదాస్పద కామెంట్స్...
పౌరసేవల కొలువులు సుదీర్ఘ శారీరక శ్రమతో కూడుకున్నవి. ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలని, వీటిలో రిజర్వేషన్ ఎందుకు?' అని ప్రశ్నించారు. ఆమె చేసిన ట్వీట్ దుమారాన్ని రేపుతోంది. అనేక మంది నెటిజన్లు స్మితా సబర్వాల్ ట్వీట్ పై నెగిటివ్ గా స్పందిస్తున్నారు. ఇది సరికాదని అభిప్రాయాన్ని మార్చుకోవాలంటూ హితవు పలుకుతున్నారు.
Next Story