Mon Dec 23 2024 01:57:43 GMT+0000 (Coordinated Universal Time)
ఆ నేతకు దిగ్విజయ్ ఫోన్
తెలంగాణ కాంగ్రెస్ పరిశీలకుడిగా నియమితులైన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డికి ఫోన్ చేశారు
తెలంగాణ కాంగ్రెస్ పరిశీలకుడిగా నియమితులైన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డికి ఫోన్ చేశారు. ఈరోజు సాయంత్రం జరిగే భేటీ వాయిదా వేసుకోవాలని సూచించారు. తాను అందరితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిసింది. తొందరపడి సమావేశాలు పెడుతూ పార్టీని మరింత బలహీన పర్చే ప్రయత్నం చేయవద్దని దిగ్విజయ్ సింగ్ మహేశ్వర్ రెడ్డిని కోరినట్లు సమాచారం.
సాయంత్రం భేటీ...
తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభాన్ని నివారించేందుకు పార్టీ హైకమాండ్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు సాయంత్రం మహేశ్వర్ రెడ్డి ఇంట్లో టి కాంగ్రెస్ నేతలు మరోసారి భేటీ అయి ఢిల్లీ పెద్దలతో చర్చించాల్సిన విషయాలపై చర్చించాలని భావించారు. దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేయడంతో సీనియర్ నేతల సమావేశాన్ని రద్దు చేశామని మహేశ్వర్ రెడ్డి మీడియాకు తెలిపారు.
Next Story