Thu Dec 19 2024 22:48:24 GMT+0000 (Coordinated Universal Time)
ప్రియాంకకు పూర్తి బాధ్యతలు
తెలంగాణ ఎన్నికలకు ప్రియాంక గాంధీకి పూర్తిగా బాధ్యతలు అప్పగిస్తామని సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు
తెలంగాణ ఎన్నికలకు ప్రియాంక గాంధీకి పూర్తిగా బాధ్యతలు అప్పగిస్తామని సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే పూర్తిగా తెలంగాణపై ఫోకస్ పెడతామని ఆయన తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతల మధ్య ప్రియాంక గాంధీ ఐక్యత కుదురుస్తారని కూడా తెలిపారు. కర్ణాటక ఎన్నికలు పూర్తయిన వెంటనే ప్రియాంక తెలంగాణపై దృష్టి పెడతారని జైరాం రమేష్ తెలిపారు.
కాంగ్రెస్ దే అధికారం...
కర్ణాటకలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని జైరాం రమేష్ తెలిపారు. కర్ణాటకలో 130 స్థానాలకు పైగానే స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని, ఒంటరిగానే అధికారంలోకి వస్తుందని తెలిపారు. ప్రజల మూడ్ చూస్తుంటే కర్ణాటకలో కాంగ్రెస్ విజయం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ అసమర్థ పాలనతో ప్రజలు విసిగిపోయారని జైరాం రమేష్ అన్నారు.
Next Story