Fri Apr 04 2025 06:02:23 GMT+0000 (Coordinated Universal Time)
హైకమాండ్ కు సీనియర్ నేత జానారెడ్డి లేఖ
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు సీనియర్ నేత జానారెడ్డి లేఖ రాశారు.

కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు సీనియర్ నేత జానారెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నేతలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని జానారెడ్డి తన లేఖలో కోరారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్ కు కూడా జానా రెడ్డి లేఖ రాశారు. త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జానారెడ్డి ఈ లేఖ రాశారు.
ఈ రెండు జిల్లాలకు...
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదని, వారికి అవకాశం కల్పించాలని కోరారు. ఎప్పుడు మంత్రి వర్గ విస్తరణ జరిగినా ఈ రెండు జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటే పార్టీ బలోపేతం అవుతుందని జానారెడ్డి లేఖలో పేర్కొన్నారు. జానారెడ్డిని పలువురు ఆశావహులు కలిసి ఆయనను అభ్యర్థించడంతో ఈ లేఖ రాసినట్లు తెలిసింది.
Next Story