Sat Nov 23 2024 09:20:48 GMT+0000 (Coordinated Universal Time)
ఇద్దరూ ఒక కులపోళ్లే.... కలవడం గొప్పేముంది?
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ పై సీనియర్ నేత వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలకు ఎప్పుడూ గ్యాప్ ఇవ్వరు. కొంత సయోధ్య కుదరుతుందంటే చాలు మరో రూపంలో పార్టీకి నస్టం చేకూర్చే వ్యాఖ్యలు చేస్తుంటారు. ఎక్కువగా సీనియర్ నేతలే పార్టీ పరువను బజారు కీడుస్తున్నారు. ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇద్దరు నేతలు కలవడంతో కొంత క్యాడర్ లో జోష్ కన్పించింది. తాను రేవంత్ తో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు.
శాపనార్థాలు పెట్టొద్దు...
అయితే దీనిపై పార్టీ సీనియర్ నేత వ్యాఖ్యలు పార్టీని ఇబ్బందిపెట్టేరకంగా ఉన్నాయి. ఇద్దరు రెడ్లు కలిశారని, వారిద్దరూ కలవడం పెద్ద గొప్పేమీ కాదని వి.హనుమంతరావు అన్నారు. వాళ్లంతా చుట్టాలేనని వీహెచ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు నాడు కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టడం సరికాదని వీహెచ్ అన్నారు. పుట్టిన రోజు నాడు శాపనార్థాలు పెట్టడం సరికాదని, ఆడవాళ్లే శాపనార్థాలు పెడతారని పరోక్షంగా రేవంత్ పై వీహెచ్ వ్యాఖ్యలు చేశారు.
Next Story