Mon Dec 23 2024 04:33:02 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మరోసారి కాంగ్రెస్ సీనియర్ల భేటీ
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈరోజు మరోసారి సమావేశం కానున్నారు
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈరోజు మరోసారి సమావేశం కానున్నారు. కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి ఇంట్లో ఈ భేటీ జరగనుంది. ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో మాట్లాడే విషయంపై ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు. కాంగ్రెస్ కమిటీల నియామకంలో చోటు చేసుకున్న పరిణామాలపై సీనియర్ నేతలు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో సమావేశం అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ఢిల్లీకి వెళ్లేందుకు...
పీసీసీ సమావేశానికి కూడా సీనియర్ నేతలు ఎవరూ హాజరు కాలేదు. ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి ఫిర్యాదు చేయాలన్న యోచనలో ఉన్నారు. అందుకే కార్యాచరణను సిద్ధం చేసుకునేందుకు నేడు సమావేశం కానున్నారు. పార్టీ పరిస్థితిపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి సీనియర్ నేతలందరూ సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే సమాచారం అందింది. ఏఏ అంశాలపై అధినాయకత్వంతో చర్చించాలన్న దానిపై నేడు సమావేశం కానున్నారు.
Next Story