Fri Dec 20 2024 07:15:07 GMT+0000 (Coordinated Universal Time)
DK Aruna : ఊపిరి ఉన్నంత వరకూ బీజేపీలోనే ఉంటా
ప్రాణం ఉన్నంత వరకూ తాను భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానని పార్టీ సీనియర్ నేత డీకే అరుణ అన్నారు.
ప్రాణం ఉన్నంత వరకూ తాను భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానని పార్టీ సీనియర్ నేత డీకే అరుణ అన్నారు. తాను పార్టీ మారతానన్న ప్రచారం జరుగుతందని, అందులో వాస్తవం లేదని ఆమె తెలిపారు. తాను బీజేపీలోనే ఉంటానని చెప్పారు. పార్టీలో ఉంటూ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తానని డీకే అరుణ తెలిపారు.
ప్రచారం నమ్మొద్దు...
తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవని తెలిపారు. కేవలం బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలనే తాను బరి నుంచి తప్పుకున్నానని, ఇప్పటికే భారతీయ జనతా పార్టీ బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన విషయాన్ని డీకే అరుణ గుర్తు చేశారు. తాను బీజేపీ పార్టీని వీడేది లేదని, జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని డీకే అరుణ తెలిపారు.
Next Story