Mon Dec 23 2024 15:32:27 GMT+0000 (Coordinated Universal Time)
Congress : కార్యకర్తలతో జగ్గారెడ్డి నేడు భేటీ
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఈరోజు కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఈరోజు కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలోనే భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనున్నారు. జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సీనియర్ల సూచనల మేరకు తన రాజీనామా నిర్ణయాన్ని పదిహేను రోజుల పాటు వాయిదా వేసుకున్నారు.
ఈ సమావేశంలోనే.....
ఈరోజు జగ్గారెడ్డి తన ముఖ్య కార్యకర్తలు, సన్నిహితులతో సమావేశం అవుతున్నారు. రాజీనామా విషయంలో వారి అభిప్రాయాలను తీసుకోనున్నారు. జగ్గారెడ్డి తాను స్వతంత్రంగా వ్యవహరిస్తానని, ఇక ఏ పార్టీలో ఉండనని చెప్పిన తర్వాత జరుగుతున్న ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం తర్వాత జగ్గారెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది.
Next Story