Mon Nov 18 2024 06:01:18 GMT+0000 (Coordinated Universal Time)
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు
ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలిసింది
ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లు ట్యాప్ చేశామని ఆయన అంగీకరించారు. మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు సహకారంతో ట్యాపింగ్ చేసినట్లు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆర్థికంగా సాయపడే వారి ఫోన్లు ట్యాప్ చేశామని చెప్పారు. బీఆర్ఎస్ లో లో వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లను సయితం ట్యాప్ చేసినట్లు భుజంగరావు తెలపారు. ఎస్ఓటీ, టాస్క్‌ఫోర్స్ సహకారంతో ఫోన్ ట్యాపింగ్ చేశామని తెలిపారు. విపక్ష నేతలు, విద్యార్థి నేతలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశమంటూ భుజంగరావు చెప్పినట్లు తెలిసింది.
ఎన్నికల సమయంలో...
ప్రతిపక్ష నేతల కుటుంబసభ్యుల ఫోన్లు, వాహనాలను కూడా ట్రాక్ చేసినట్లు అంగీకరించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సమయంలో ట్యాపింగ్ చేశామని ఆయన తెలిపారు. మూడు ఉప ఎన్నికల సమయంలోనూ ట్యాపింగ్ చేశామని, మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్ మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేశామని ఆయన వాంగ్మూలంలో తెలిపారని సమాచారం. ఎన్నికల సందర్భంగా రెండు ప్రయివేటు ఆసుపత్రుల నుంచి భారీగా నగదును తరలించామని కూడా అంగీకరించారు. బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో డబ్బు తీసుకెళ్లామని తెలిపారు.
Next Story